Friday, April 11, 2014
నిన్నటిదాకా శిలనైనా
చిత్రం : మేఘసందేశం (1982)
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
సరసా సరాగాల సుమరాణినీ.. స్వరసా సంగీతాల సారంగినీ
మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మవ్వంపు నటనాల.. మాతంగిణి
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
నీ మమతావేశపు వెల్లువలో.. గోదారి గంగనై పొంగుతు ఉన్నా..
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమా ప్రాణాలైనా ప్రియురాలినీ
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే..
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
నీ మమతావేశపు వెల్లువలో.. గోదారి గంగనై పొంగుతు ఉన్నా..
నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకినే గౌతమినైనా
Labels:
(మ),
మేఘసందేశం (1982),
రమేశ్ నాయుడు,
వేటూరి,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment