Saturday, May 10, 2014

తోడు నీడ ఎవరులేని ఒంటరి

చిత్రం :  మంచి-చెడు (1963)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


తోడు నీడ ఎవరులేని ఒంటరి..వాడు లోకమనే పాఠశాల చదువరీ...
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ...వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ...
తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ..
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... వాని చిత్తమున మెత్తదనం కలదు మరీ
చిత్తమున మెత్తదనం కలదు మరీ...


చరణం 1:


కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు.. కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు... కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు
ఉన్నదంత యిచ్చి ఊరడించునూ... తానె ఊరు చేరువరకు తోడువచ్చును
ఊరు చేరువరకు తోడు వచ్చును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 2:


ఆకలైన పులిలాగే ఉరుకును... కాని మచ్చికతో మనసు నిచ్చివేయును
కళా హృదయమున్న మేలి రసికుడు... సదా కనులలోనే కదలాడే యువకుడు
కనులలోనే కదలాడే యువకుడు...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ
లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 3:


రేపు వాని మనసు మార వచ్చును... వాడు మాపు మాని పగలు తిరుగ వచ్చును

తల్లి మనసు చల్లదనము తెలియును... వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...

ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. వాడు లోకమనే పాఠశాల చదువరీ..
చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ
చిత్తమున మెత్తదనం కలదుమరీ...

No comments:

Post a Comment