Thursday, May 15, 2014

ఈ పాదం ఇలలోన నాట్య వేదం

చిత్రం: మయూరి (1985)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ



పల్లవి:


ఈ పాదం ఇలలోన నాట్య వేదం

ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం...


చరణం 1:


ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనీ ఆ గౌతమే పొంగగా...


పాట పాటలో తను చరణమైన వేళా
కావ్య గీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే...


ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం


చరణం 2:


ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై


ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం


ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం

No comments:

Post a Comment