Sunday, May 11, 2014

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట

చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


ఆ...ఆ..ఆ..ఆ
అహా...ఆ...ఆ..ఆ..


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని ...నా నెచ్చలి కలలన్ని పండాలని
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... నీ బ్రతుకంత కావలి పూలబాట..


చరణం 1:


హృదయమనేదీ ఆలయము.... స్నేహం దేవుణి ప్రతిరూపమూ..ఊ..
హృదయమనేదీ ఆలయము.. స్నేహం దేవుణి ప్రతిరూపమూ..
కులమేదైన.. మతమేదైనా...
కులమేదైన.. మతమేదైనా..దానికి లేదు ఆ బేధమూ...


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..


చరణం 2:


ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆనందాల తేలే వేళ...
ఆనందాల తేలే వేళ ... అభినందనలు ఈ చెలికి..


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని...నా నెచ్చలి కలలన్ని పండాలని
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..

2 comments:

  1. గీత రచన చేసింది మైలవరపు గోపీ గారు అనుకుంటానండీ. సరిచూడగలరు.

    ReplyDelete