Wednesday, May 21, 2014

ఏ తీగ పూవునో

చిత్రం: మరో చరిత్ర (1978)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల, కమల్ హాసన్


పల్లవి:


ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో


అప్పడియన్న ?
హ హ హ అర్ధం కాలేదా ?


ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో...


చరణం 1:


మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది


ఆహా ! అప్పడియా !
హ ! పెద్ద అర్ధం అయినట్టు !


భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినదీ
మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో

కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో...

చరణం 2:


వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది


ఏయ్.. నీ రొంబ అళగా ఇరికే..
హా..రొంబా? అంటే ?


ఎల్లలు ఏవీ వొల్లనన్నది
నీదీనాదోక లోకమన్నదీ
నీదీనాదోక లోకమన్నది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో...

చరణం 3:


తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది


నల్ల పొన్ను.. అంటే నల్ల పిల్లా


మొదటి కలయికే ముడివేసినదీ
తుదిదాకా ఇది నిలకడైనదీ
తుదిదాకా ఇది నిలకడైనది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో...

No comments:

Post a Comment