Sunday, May 11, 2014

నిన్ను చూడనీ... నన్ను పాడనీ

చిత్రం :  మనుషులు మమతలు (1965)
సంగీతం : టి. చలపతిరావు

నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


నిన్ను చూడనీ... నన్ను పాడనీ....

ఇలా వుండిపోనీ నీ చెంతనే...
నిన్ను చూడనీ....


చరణం 1:


ఈ కనులు నీకే .. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే.. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలా వుండిపోనీ నీ దాసినై.. 


నిన్ను చూడనీ... నన్ను పాడనీ...
నిన్ను చూడనీ...


చరణం 2:


నీవు లేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలా రాలిపోనీ నీ కోసమే.. 


నిన్ను చూడనీ..  నన్ను పాడనీ

నిన్ను చూడనీ

No comments:

Post a Comment