Monday, May 12, 2014

సిగ్గేస్తోందా.. సిగ్గేస్తోందా

చిత్రం : మనుషులు మమతలు (1965)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల


పల్లవి:


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా.. నీకు సిగ్గేస్తోందా


సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది
చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తోంటే
సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది


చరణం 1:


నీడలో నిలిచినా.. నీటిలో మునిగినా
తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
నీడలో నిలిచినా.. నీటిలో మునిగినా
తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే



నీడలో లేదులే నీటిలో లేదులే
నీడలో లేదులే నీటిలో లేదులే
అది నీ వయసులోని ఆరిపోని వేడిలే

వై.. వైవైవై ... 


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా

మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే.. హొయ్..
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా


చరణం 2:


మత్తు గాలి వీచెను మనసు పూలు  పూచెను
రంగు రంగు ఊహలే పొంగులై లేచెను..

ఓ.. ఓ.. ఓ.. ఓ..

మత్తు గాలి వీచెను మనసు పూలు  పూచెను
రంగు రంగు ఊహలే పొంగులై లేచెను


ఇలాటి వేళలో ఈ లేత గాలిలో
ఇలాటి వేళలో ఈ లేత గాలిలో
నీలోని పొంగులేవో నేను సైపలేనులే..

వై.. వైవైవై ... 


సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా

మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే.. హొయ్..
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా..  సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా


సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది.. సిగ్గేస్తోంది
చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తోంటే.. 
హొయ్..

సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది
సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది



No comments:

Post a Comment