Wednesday, May 14, 2014

అందెలు పిలిచిన అలికిడి లో

చిత్రం :  మయూరి (1985)
సంగీతం :  బాలు
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: జానకి

పల్లవి:

అందెలు పిలిచిన అలికిడిలో...  అణువణువున అలజడులూ
యద పదమొకటౌ లాహిరిలో... 

యద పదమొకటౌ లాహిరిలో... ఎన్నడు ఎరగని ఉరవడులు

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల

ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

చరణం 1:

ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా...  ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా

ఒక కదలిక చిరు మెదలిక... గిలిగింతగ జనియించగా

నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా

అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

చరణం 2:

మేఘ వీణ చలి చినుకు చిలికినా మేను లోన చిరు అలలు కదలినా

ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా

సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా

వరాళి ఎదలొ స్వరాల రొదలో స్వరము పాడనా ఆడ నా

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

No comments:

Post a Comment