Friday, May 9, 2014

అమ్మాయే పుడుతుంది

చిత్రం :  మంచివాడు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


అమ్మాయే పుడుతుంది..  అచ్చం అమ్మలాగే ఉంటుంది
అమ్మాయే పుడుతుంది..  అచ్చం అమ్మలాగే ఉంటుంది


అబ్బాయే పుడతాడు..  అచ్చం నాన్నలాగే ఉంటాడు
అబ్బాయే పుడతాడు..  అచ్చం నాన్నలాగే ఉంటాడు


చరణం 1:


కోటేరులాంటి ముక్కు.. కోలకళ్ళు..
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
కోటేరులాంటి ముక్కు... కోలకళ్ళు..
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు..

ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు

..ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో సిరులు

అబ్బాయే పుడతాడు..  అచ్చం నాన్నలాగే ఉంటాడు

అమ్మాయే పుడుతుంది..  అచ్చం అమ్మలాగే ఉంటుంది

చరణం 2:


దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు...
దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు..
ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు.. 

ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..
ఈ ఆత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్ళు..

అమ్మాయే పుడుతుంది..  అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  అచ్చం నాన్నలాగే ఉంటాడు

చరణం 3:


నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను
అహా.. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను..
ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?
హ హా..హా..

అమ్మాయే పుడుతుంది..  అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  అచ్చం నాన్నలాగే ఉంటాడు

అహా...  అమ్మలాగే ఉంటుంది

ఊహు... నాన్నలాగే ఉంటాడు



No comments:

Post a Comment