Sunday, May 11, 2014

నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లా

చిత్రం :  మనవూరి పాండవులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  జి. ఆనంద్, ఎస్. పి. శైలజ


పల్లవి:


నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లా
తెల్ల తెల్ల
ని చందమామ లగ్గో పిల్ల

నల్ల నల్లని మబ్బులోనా లగ్గో పిల్లా
తెల్ల తెల్ల
ని చందమామ లగ్గో పిల్ల


కొప్పూలోన మల్లెపూవులు ఘుమఘుమలాడుతుంటే
చేతినున్న చిట్టి గాజులు ఘల్లు ఘల్లుమంటుంటే
అబ్బబ్బా..హబ్బబ్బా నా వళ్ళు ఝల్లుమంటున్నాదే


నల్లా నల్లని మబ్బుల్లోనా లగ్గో పిల్ల
తెల్లా తెల్లని చందమామ లగ్గో పిల్ల


మంచినీళ్ళ బావి కాడ లగ్గో మావా
మాటా మాటా కలిసిందే లగ్గో మావా

మంచినీళ్ళ బావి కాడ లగ్గో మావా
మాటా మాటా కలిసిందే లగ్గో మావా


సింగపూరు రంగు సీర మెహమను ఇస్తవా
లక్కవరం తిరనళ్ళో ముక్కెర కొని ఇస్తావా

కాపవరం సంత నుంచీ కడియాలు తెస్తావా


మంచి నీళ్ళ బావి కాడా లగ్గో మావా
మాటా మాటా కలిసిందే లగ్గో మావ


చరణం 1:


మొవ్వాకు చీర పెడతా ముక్కు మీద..ఊ..ముక్కు మీద.. ముద్దెడతా..ఏయ్..

కాపవరం వోటలు కాడా కాఫీ నీలు తాపిస్తా

మొవ్వాకు చీర పెడతా ముక్కు మీద ముద్దెడతా
కాపవరం వోటలు కాడా కాఫీ నీలు తాపిస్తా

దొరగారు.. మా దొరగారు సయ్యంటే సరదాలు తీరుస్తా

దొరగారు సయ్యంటే సరదాలు తీరుస్తా

ఛీ పో! నీ దొర పేరు వింటూ ఉంటే ఒళ్ళుమంటా
సరదాలు సరసాలు వద్దు పొమ్మంటా
ఛీ ఛీ ఫో! నీ దొర పేరు వింటూ ఉంటే ఒళ్ళుమంటా
సరదాలు సరసాలు వద్దు పొమ్మంటా


నువ్వే నా దొరవంటా
నిన్నే కళ్ళకద్దుకుంటా


అల్లా అల్లా నువ్వంటే సిగ్గో పిల్లా
ఇల్లా ఇల్లా ఎత్తుకుంటా లగ్గో పిల్లా

అల్లా అల్లా నువ్వంటే సిగ్గో పిల్లా
ఇల్లా ఇల్లా ఎత్తుకుంటా లగ్గో పిల్లా

ఓసి లగ్గో పిల్లా ఓహో లగ్గో పిల్ల

No comments:

Post a Comment