Friday, May 9, 2014

నేలతో నీడ అన్నది

చిత్రం :  మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదనీ...
ఒక భార్య అన్నది


చరణం 1:


వేలికొసలు తాకనిదే.. వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే.. నల్లమబ్బు కురిసేనా
తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే...
నీవు లేవు... నేను లేను...
నీవు లేవు నేను లేను.. లోకమే లేదులే


నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని


చరణం 2:


రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు... మనిషి లేడు....
మమత లేదు... మనిషి లేడు...
మనుగడయే లేదులే..


నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని


చరణం 3:


అంటరానితనము ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
అంటరానితనము ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము


ఇక సమభావం సమధర్మం
సహజీవనపనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం
తెలియకుంటే మీ కర్మం


నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదనీ...
ఒక భార్య అన్నది...
ఈ భార్య అన్నది




No comments:

Post a Comment