Tuesday, May 13, 2014

పాపాయి నవ్వాలి

చిత్రం :  మనుషులు మారాలి (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

పాపాయి నవ్వాలి... పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు
పాపాయి నవ్వాలి..పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు...

పాపాయి నవ్వినా... పండగే వచ్చినా... పేదల కన్నుల కన్నీరే..
పాపాయి నవ్వినా... పండగే వచ్చినా... పేదల కన్నుల కన్నీరే
నిరు పేదల కన్నుల కన్నీరే ..

పాపాయి నవ్వాలి... పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు

చరణం 1:

కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... కనువిందు చేసేను జాబిల్లి
కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... కనువిందు చేసేను జాబిల్లి

ఆషాఢమాసాన... మేఘాల చెరలోన అల్లాడిపోయెను జాబిల్లి
ఆషాఢమాసాన... మేఘాల చెరలోన అల్లాడిపోయెను జాబిల్లి
అల్లాడి పోయెను జాబిల్లి

నిద్దురపో... నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...

నిద్దురపో...  నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...

పాపాయి నవ్వాలి... పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు

చరణం 2:

వైశాఖమాసాన... భూదేవి సిగలోన... మరుమల్లెచెండౌను జాబిల్లి
శ్రావణమాసాన... జడివాన ఒడిలోన... కన్నీటి కడవౌను జాబిల్లి
కన్నీటి కడవౌను జాబిల్లి

నిద్దురపో... నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...
నిద్దురపో... నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో...

పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు..
పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... మా ఇంట కురవాలి... పన్నీరు...

No comments:

Post a Comment