Monday, June 30, 2014

వివాహభోజనంబు...

చిత్రం :  మాయాబజార్ (1957)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  మాధవపెద్ది సత్యం


పల్లవి:


అహహహహహా వివాహభోజనంబు ఆహా హా
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహా అహాహా అహాహా అహాహాహా


చరణం 1:


ఔరౌరా గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల
ఔరౌరా గారెలల్ల ...అయ్యారె బూరెలిల్ల
ఓ హో రే అరెసెలిల్ల... అహాహా... అహాహా
ఇయెల్ల నాకె చెల్ల...


వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహా అహాహా అహాహా అహాహాహా


చరణం 2:


భళేరె లడ్డు లందు వహ్ తేనిపోని ఇందు
భలే జిలాబి ముందు అహాహా హాహా
ఇయెల్ల నాకే విందు


వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహా అహాహా అహాహా అహాహాహా



చరణం 3:


మఝారె అప్పడాలు... పులిహోర దప్పడాలు
మజారే అప్పడాలు ....పులిహోర దప్పడాలు
వహ్వారే పాయసాలు అహా హాహాహా
ఇయెల్ల నాకే చాలు...


వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహా అహాహా అహాహా అహాహాహా
అహాహా అహాహా అహాహా అహాహాహా


No comments:

Post a Comment