Thursday, June 12, 2014

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

చిత్రం :  మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  ఘంటసాల, భానుమతి



పల్లవి:


ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా..
ఏడ తానున్నాడో బావా..
జాడ తెలిసిన పోయిరావా ఆ ఆ ఆ
అందాల ఓ మేఘమాలా ఆ ఆ ఆ
చందాల ఓ మేఘమాలా..


గగనసీమల తేలు ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా..
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా ఆ...
నీలాల ఓ మేఘమాల ఆ.. రాగాల ఓ మేఘమాల


చరణం 1:


మమతలెరిగిన మేఘమాలా
నా..మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచేనే
బావకై చెదరి కాయలు కాచెనే ఏ ఏ ఏ


నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా


చరణం 2:


మనసు తెలిసిన మేఘమాలా ఆ ఆ..
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని
కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లి రూపే నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచెనే


చరణం 3:


జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుకజాలా
జాలి గుండెల మేఘమాలా...
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల...

No comments:

Post a Comment