Friday, June 13, 2014

ఔనా నిజమేనా

చిత్రం :  మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  ఘంటసాల, భానుమతి



పల్లవి:


ఔనా... నిజమేనా...
ఔనా.. నిజమేనా..
మరతునన్న మరవలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా..  బావ మాట మరచేవా..
ఔనా.. నిజమేనా
ఔనా..


చరణం 1:


మనసులోనా మరులు గొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి.. రాతి బొమ్మ మిగిలేనా
ఔనా.. నిజమేనా
ఔనా...


చరణం 2:


ఔనా... కలలేనా
ఔనా... కలలేనా
నాటి కథలు వ్యధలేనా.. నీటి పైని అలలేనా
బావ నాకు కరువేనా.. బ్రతుకు యింక బరువేనా
ఔనా..  కలలేనా


చరణం 3:


పగలు లేని రేయి వోలే.. పలుకలేని రాయి వోలే
బరువు బ్రతుకు మిగిలేనా.. వలపులన్నీ కలలేనా
ఔనా.. కలలేనా
ఔనా..కలలేనా


No comments:

Post a Comment