Thursday, June 12, 2014

ఎందుకే నీకింత తొందరా

చిత్రం :  మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  భానుమతి
 



పల్లవి:


ఎందుకే నీకింత తొందరా
ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే
ఎందుకే నీకింత తొందర


ఓ చిలుక.. నా చిలుకా..ఆ
ఓ చిలుక.. నా చిలుకా... ఓ రామచిలుక..
వయ్యారి చిలుక.. నా గారాల మొలక..
ఎందుకే నీకింత తొందరా



చరణం 1:


బాధలన్నీ పాత గాధలైపోవునే
బాధలన్నీ పాత గాధలైపోవునే
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే
యేలాగో ఓలాగు ఈ రేయి దాటెనా....ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే


ఎందుకే నీకింత తొందర


చరణం 2:


ఆ చోట ఆ చోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
చిరుగాలి తరగలా.. చిన్నారి పడవలా
పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము
ఎందుకే నీకింత తొందర




1 comment:

  1. my favorite song... super singing and composition. aa veena bits super..

    ReplyDelete