Wednesday, June 18, 2014

ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో

చిత్రం :  మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
నేపధ్య గానం :  బాలు


పల్లవి:

ఎవ్వరో ఎవ్వరో.... 


ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో
ఎవ్వరో వారెవ్వరో... 


అందెలు సందడి చేసిన జాతరలో.. ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో.. అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో ఈ చిందులు... ఎవరికో ఈ విందులు
ఏమిటో ఏమి
టో ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో

ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో..  ఆ ధర్మం ఏమిటో?




చరణం 1:


శీలానికి శిలువలు.. కామానికి కొలువులు
కన్నీటి కలువలు.. ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు.. రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన.. నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేదింకెన్నడో?
ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?



చరణం 2:


అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
మైల పడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు
ఎందరికో ఈ కౌగిళ్ళు.. ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు
ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో
ఏ వాదం ఇది నేరం అన్నదో?
ఎక్కడో? ఆ వేదం ఎక్కడో?



చరణం 3:


ఈ మల్లెల దుకాణాలు..  ఈ గానాబజానాలు
వెదజల్లిన కాగితాలు.. వెలకట్టిన జీవితాలు..
వల్లకాటి వసంతాలు.. చస్తున్నా స్వాగతాలు
కట్లు తెగిన దాహాలకు.. తూట్లు పడిన దేహాలు
ఎక్కడో? ఎక్కడో? ఈ రాధల బృందావనమెక్కడో?
ఈ బాధకు వేణుగానం 
ఎన్నడో?

ఎన్నడో?  ఎక్కడో?  ఎప్పుడో?


No comments:

Post a Comment