Sunday, June 22, 2014

మనసే దోచావు నీవు



చిత్రం :  అమ్మాయి మనసు (1987)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..
ఉన్నా నీలోనే ఉన్నా.. ఏది కాలేక ఉన్నా


మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..



చరణం 1:


తలుపులు తెరిచింది నీవు
వెలుగులు తెచ్చింది నీవు
ఇంటిని కంటిని వెలిగించి వెళ్ళినావు 


వెన్నెల చిరుజల్లు చిలికి
కన్నుల వాకిళ్ళు అలికి
నవ్వుల ముగ్గులు ఎన్నెన్నో వేసినావు
కలవై కళవై  మిగిలి


మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..


చరణం 2:

ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


సరిగమ ఏడే స్వరాలూ 

నడిచినవి ఏడే అడుగులు
మరవకు చెరపకు.. నూరేళ్ళ జ్ఞాపకాలు 


మరవకు మన ప్రేమ గీతం..
మాపకు తొలి ప్రేమ గాయం
నీవని నేనని విడతీసి ఉండలేవు
ఆరో ప్రాణం నీవు 


మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి నను మరచి నీ మనిషై ఉన్నాను
ఉన్నా నీలోనే ఉన్నా.. వేరే కాలేక ఉన్నా ..


మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి నను మరచి నీ మనిషై ఉన్నాను

2 comments:

  1. ఇంత శ్రమ తీసుకుని, శ్రద్ధగా పాటల సాహిత్యం పంచుతున్నందుకు నెనర్లు. కవిత్వంలో సినీగీతాలు జనావళికి అతి చేరువైన ప్రయోగం అని గాఢమైన నమ్మిక నాకు. ఇలా ఎవరు ఏ రూపేణనైనా ఆ అపారమైన అక్షర నిధిని ఒక దరికి చేర్చినా ఆనందమే! ధన్యవాదాలండి...

    ReplyDelete