Thursday, June 12, 2014

కోతీ బావకు పెళ్ళంటా




చిత్రం :  మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం :  భానుమతి 



పల్లవి:


ఓ..ఓ.. 


కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట


మల్లీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా..  బంతులు కట్టి తెస్తారా...

పెళ్ళికి మీరు వస్తారా? పేరంటానికి వస్తారా?

చరణం 1:



పందిరి వేస్తాము.. ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద పెళ్ళివారికి విందులు చేస్తాము.. బాగా విందులు చేస్తాము
బాకా బాజా డోలూ సన్నాయ్ .. 

బాకా బాజా డోలూ సన్నాయ్.. బాకా బాజా డోలూ సన్నాయ్
మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు... తప్పెట తాళాలెడతారు


కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట...



చరణం 2:


అందాలా మా బావగారికి గంధాలు పూసి
ఓ..గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము... కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసీ.. గంధం పూసీ... కుళ్ళేయేసి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము


ఓ..పల్లకి యెక్కి ...
పల్లకి యెక్కి కోతీ బావా పళ్ళికిలిస్తాడు
బావా పళ్ళికిలిస్తాడు...
మా కోతీ బావా పళ్ళికిలిస్తాడు.. 


కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట..

No comments:

Post a Comment