Saturday, June 28, 2014

పెనుచీకటాయె లోకం

చిత్రం :  మాంగల్య బలం (1958)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె


చరణం 1:


చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ తలదాల్చలేనైతినే


కలలే నశించిపోయే మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ విధియే పగాయె


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె


చరణం 2:


మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా


తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ విధియే పగాయె


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1516

No comments:

Post a Comment