Sunday, June 29, 2014

విధి చేయు వింతలన్నీ

చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  వాణీ జయరాం


పల్లవి :


విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి..  విలపించే కథలు ఎన్నో

విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి..  విలపించే కథలు ఎన్నో

విలపించే కథలు ఎన్నో.... 

చరణం 1:


ఎదురు చూపులు ఎదను పిండగ
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహబాధను మరచిపోవగ
నిదురపోయెను ఊర్మిళ


అనురాగమే నిజమని
మనసొకటే దాని ఋజువని
తుది జయము ప్రేమదేనని
బలియైనవి బ్రతుకులెన్నో

విధి చేయు వింతలన్నీ...


చరణం 2:


వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో...
గొంతు కోసెను తుదిలో...


అది నేడు జరుగరాదని... ఎడబాసి వేచినాము
మనగాథే యువతరాలకు.. కావాలి మరోచరిత్ర
కావాలి మరోచరిత్ర....  


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5603

No comments:

Post a Comment