Saturday, June 28, 2014

అమ్మాలాంటి చల్లనిది

చిత్రం :  మానవుడు-దానవుడు (1972)
సంగీతం : అశ్వత్థామ
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల



పల్లవి:


అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో.. లేనే లేదులే.. లేనే లేదులే
అమ్మలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే



చరణం 1:


మమతలే.. తేనెలుగా
ప్రేమలే.. వెన్నెలగా
చెలిమి .. కలిమి .. కరుణా..
కలబోసిన లోకమది.. కలబోసిన లోకమది


అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే


చరణం 2:



పిడికెడు మెతుకులకై.. దౌర్జన్యం దోపిడీలు
కలతలూ.. కన్నీళ్ళూ..
కనరాని లోకమది.. కనరాని లోకమది


అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే


చరణం 3:


ఆకలితో నిదురపో.. నిదురలో కలలు కను
కలలో ఆ లోకాన్ని... కడుపునిండ నింపుకో
కలలో ఆ లోకాన్ని...
కడుపునిండ నింపుకో.. కడుపునిండ నింపుకో


అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో లేనే లేదులే... లేనే లేదులే
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే


No comments:

Post a Comment