Monday, June 30, 2014

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
నేపధ్య గానం :  పి. భానుమతి



పల్లవి:


శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. ఆ..ఆ..ఆ
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా.. 
ఆ..ఆ

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా



చరణం 1:


కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కన్న తండ్రి కలలు నిండి..
మా కన్న తండ్రీ కలలు నిండి కలకాలం వర్ధిల్లగా..ఆ..ఆ..ఆ..ఆ


శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా



చరణం 2:


పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా
పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి...
తెలుగు కీర్తి తేజరిల్లి..  దిశలా విరాజిల్లగా..ఆ..ఆ..ఆ..


శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..


No comments:

Post a Comment