Saturday, June 28, 2014

పచ్చని మన కాపురం

చిత్రం :  మానవుడు-దానవుడు (1972)
సంగీతం :  అశ్వత్థామ
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల



పల్లవి:


పచ్చని మన కాపురం
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం...



చరణం 1:


నీ గుండెల సవ్వడిలోన.. నా గుండెల గుసగుసలుంటే
నీ కంటిపాపలలోనా.. నా కలల రూపాలుంటే..
మన బ్రతుకే అనురాగానికి.. ప్రతిరూపమౌనులే
మన బ్రతుకే అనురాగానికి....
ప్రతిరూపమౌనులే.. ప్రతిరూపమౌనులే...


పచ్చని మన కాపురం...
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం...


చరణం 2:



నీవు లేని క్షణమైనా.. నా కనులకు ఒకయుగమై
మన ఇరువురి కలయికలో.. ఇరుమేనులు చెరిసగమై
ప్రాణంలో ప్రాణంగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
పరవశించిపోవాలి.. పరవశించిపోవాలీ....


పచ్చని మన కాపురం..
పాలవెలుగై.. మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ...
పచ్చని మన కాపురం.. .


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2205

1 comment:

  1. 'మాయని మమత' చిత్రానికి సంగీతదర్శకుడు మహదేవన్ గారు కాదండీ- అశ్వత్థామ గారు

    ReplyDelete