Saturday, June 28, 2014

నీ నీడగా నన్ను కదలాడనీ

చిత్రం :  మాతృమూర్తి (1972)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ..
నీ నీడగా నన్ను కదలాడనీ


నీ చూపులోనా ప్రణయాల వానా
శతకోటి రాగాలు కురిపించనీ.. మైమరపించనీ..
నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ..
నీ నీడగా నన్ను కదలాడనీ


చరణం 1:


జాజులు తెలుపు... జాబిల్లి తెలుపు ...
నను మురిపించే నీ మనసు తెలుపు...


కుంకుమ ఎరుపు... కెంపులు ఎరుపు...
సుధలూరే నీ అధరాలు ఎరుపు...


అనురాగాలే అనుబంధాలై...
అనురాగాలే అనుబంధాలై... నిన్ను నన్ను ముడివేయనీ
మది పాడనీ...


నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ...ఈ
నీ నీడగా నన్ను కదలాడనీ


చరణం 2:



హరివిల్లు చూశా.. నీ మేని చూశా
హరివిల్లులో లేని హొయలుంది నీలో...


సెలయేరు చూశా... నీ దుడుకు చూశా
సెలయేటిలో లేని చొరవుంది నీలో...


తీయని చెలిమి.. తరగని కలిమి...
తీయని చెలిమి.. తరగని కలిమి
మనలో.. మదిలో.. కొనసాగనీ.. ఊయలలూగనీ


నీ నీడగా నన్ను కదలాడనీ..
నీ గుండెలో నన్ను నిదురించనీ...


నీ చూపులోనా ప్రణయాల వానా
శతకోటి రాగాలు కురిపించనీ.. మైమరపించనీ..
నీ నీడగా నన్ను కదలాడనీ..
నీ గుండెలో నన్ను నిదురించనీ....
 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7051

No comments:

Post a Comment