Saturday, June 28, 2014

వేణువై వచ్చాను భువనానికి

చిత్రం :  మాతృదేవోభవ (1993)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  చిత్ర


పల్లవి:


వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి


మాతృదేవోభవ.. మాతృదేవోభవ
పితృదేవోభవ.. పితృదేవోభవ
ఆచార్యదేవోభవ.. ఆచార్యదేవోభవ


చరణం 1:


ఏడుకొండలకైనా బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడుకొండలకైనా బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే


ఈ కంటిలో నలక లోవెలుగునే గనక
నేను మేననుకుంటే ఎద చీకటే.....
హరీ..... హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ... రామ పాదము రాక ఏనాటికీ..


వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి.. ఈ.. ఈ.. గాలినైపోతాను గగనానికి


చరణం 2:


నీరు కన్నీరాయే.. ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో..
నీరు కన్నీరాయే.. ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో..


ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు...
హరీ.....  హరీ..... హరీ.....
రెప్పనై ఉన్నాను మీ కంటికి.. పాపనై వస్తాను మీ ఇంటికి...


వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోయాను గగనానికి..

గాలినైపోయాను..... గగనానికి.....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12459

2 comments:

  1. what a song got national best lyricist award hats off to Legend Veturi

    ReplyDelete
  2. Ralipoye puvva neeku ragalenduke

    ReplyDelete