Tuesday, July 1, 2014

చూపులు కలసిన శుభవేళా

చిత్రం :  మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:


చూపులు కలసిన శుభవేళా..
ఎందుకు నీకీ కలవరము.. ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళా... ఎందుకు నీకీ కలవరము


చూపులు కలసిన శుభవేళా...
ఎందుకు నీకీ పరవశము.. ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ.. ఎందుకు నీకీ పరవశము


చరణం 1:


ఆలాపనలు సల్లాపములు.. కలకల కోకిల గీతములే..ఏ..ఏ...ఏ..
ఆలాపనలు సల్లాపములు.. కలకల కోకిల గీతములే
చెలువములన్ని చిత్ర రచనలే..ఏ..ఏ..
చెలువములన్ని చిత్ర రచనలే
చలనములోహో..  నాట్యములే..
చూపులు కలసిన శుభవేళ..  ఎందుకు నీకీ కలవరము



చరణం 2:


శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే..ఏ..ఏ..ఏ..
శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే..ఏ..ఏ...
ఉద్యానమున వీర విహారమే..
తెలిపెదనో హో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళా..  ఎందుకు నీకీ పరవశము
...ఎందుకు నీకీ కలవరము



No comments:

Post a Comment