Wednesday, July 2, 2014

తెలుసుకొనవే చెల్లి

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి


మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని

మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని

తెలుసుకొనవే చెల్లి.. అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


చరణం 1:


మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని ...  ఆ...  ఆ...
మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని


తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి


చరణం 2:


పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ... ఆ... ఆ...
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని
లేని పోని అర్థాలను మన వెనుకనె చాటెదరని


తెలుసుకొనవే చెల్లి... అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి...


No comments:

Post a Comment