Wednesday, July 2, 2014

బృందావనమది అందరిది

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా, సుశీల

పల్లవి:

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే

ఎందుకే రాధా ఈశునుసూయలు.. అందములందరి ఆనందములే

చరణం 1:

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె.. ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే

చరణం 2:

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే

ఎందుకే రాధా ఈశునుసూయలు.. అందములందరి ఆనందములే..

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే..

No comments:

Post a Comment