Monday, July 28, 2014

కనులు కనులు కలిసెను

చిత్రం :  మురళీకృష్ణ (1964)

సంగీతం :  మాస్టర్ వేణు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


కనులు కనులు కలిసెను...  కన్నె వయసు పిలిచెను

కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను

విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 1 :


ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము

ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము

సిగ్గు చేత ఎర్రబడిన బుగ్గలదీ అందము

కోరిన చిన్న దాని కోర చూపే అందము కోర చూపే అందము


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 2 :


దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు

దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు

ముచ్చటైన పైటకొంగు ముడులు వేయుటెందుకు

పోవాలనుకొన్నా పోలేవు ముందుకు.. పోలేవు ముందుకు


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను


చరణం 3 :


నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును

నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును

కసురుతున్న మనసులోనే మిసిమి వలపులూరును

కలిగిన కోపమంత కౌగిలిలో తీరును కౌగిలిలో తీరును


కనులు కనులు... మనసు తెలిసెను

విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 

అసలు మనసు తెలిసెను...

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1083 

 


No comments:

Post a Comment