Tuesday, July 1, 2014

తెలుసుకొనవె యువతి

చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఏ. ఎం. రాజా


పల్లవి:


ఆఆ... ఆఆ... ఆఆఆ...


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


యువకుల శాసించుటకే..
యువకుల శాసించుటకే యువతులవతరించిరని


తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


చరణం 1:


సాధింపులు బెదరింపులు.. ముడితలకిక కూడవనీ... ఆ...అ...
సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే..
హృదయమిచ్చి పుచ్చుకొనే.. చదువేదో నేర్పాలని


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


చరణం 2:


మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ... ఆ... అ...
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని


తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3

No comments:

Post a Comment