Tuesday, July 8, 2014

జాబిలి అందం కన్నా

చిత్రం :  ముత్తైదువ (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి:


జాబిలి అందం కన్నా... నా చెలి అందం మిన్నా..
జాబిలి అందం కన్నా... నా చెలి అందం మిన్నా..
చీకటినే వెలిగించేది... జాబిలి... ఆ వెలుగునే వెలిగించేది..నా చెలి..


జాబిలి అందం కన్నా...నా చెలి అందం మిన్న..



చరణం 1:


జాబిలి చిలికే పూవుల వెన్నెల...జాము దాటితే మాసిపోతుంది...
జాబిలి చిలికే పూవుల వెన్నెల...జాము దాటితే మాసిపోతుంది...
నా చెలి పెదవుల నవ్వుల వెన్నెల...
నా చెలి పెదవుల నవ్వుల వెన్నెల...
పగలు రేయి ...చిగురులు వేస్తుంది....


జాబిలి అందం కన్నా...నా చెలి అందం మిన్నా..


చరణం 2:


అంతగ మెరిసే జాబిలి నుదుటా..
ఎంతకు తీరని కళంకమున్నది...
సిగ్గుతొ ఒదిగే నా చెలి నుదుటా...
చెరగని కుంకుమ తిలకమున్నది...


జాబిలి అందం కన్నా... నా చెలి అందం మిన్నా...
చీకటినే వెలిగించేది... జాబిలి... ఆ వెలుగునే వెలిగించేది...నా చెలి...
జాబిలి అందం కన్నా... నా చెలి అందం మిన్నా..


చంద్రబింబమే తిలకం దిద్దగా...తారకలే హారతులివ్వగా..ఆ..ఆ..
పెళ్ళిపడుచైన నా చెలిని దీవించ...విచ్చేయునులే ఆదిముత్తైదువ...
విచ్చేయునులే ఆదిముత్తైదువ...



No comments:

Post a Comment