Tuesday, July 8, 2014

ఆగనంటుందీ అల్లరి వయసు

చిత్రం :  ముత్తైదువ (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

ఆగనంటుందీ ... అల్లరి వయసు
ఊగిపోతుందీ.. ఊయల మనసు...

ఆ వయసుతో నన్నురకనీ... ఆ మనసులో నన్నూగనీ..
గాలిలాగా... కెరటాలలాగా...
గాలిలాగా... కెరటాలలాగా...

ఆగనంటుందీ ... అల్లరి వయసు
ఊగిపోతుందీ... ఊయల మనసు...

ఆ వయసుతో నన్నురకనీ... ఆ మనసులో నన్నూగనీ..
గాలిలాగా... కెరటాలలాగా...
గాలిలాగా... కెరటాలలాగా...

చరణం 1:

నా చూపే మాటి మాటికి నీ వైపే ఉరుకుతుంది...
తాను చూసిన అందాలన్నీ... తనలోనే దాచుకుంది...
నా చూపే మాటి మాటికి నీ వైపే ఉరుకుతుంది...
తాను చూసిన అందాలన్నీ... తనలోనే దాచుకుంది...

ఎదలో దాచిన ఆ అందాలే ... పదిలంగా ఉంటాయి...
ఎదలో దాచిన ఆ అందాలే ... పదిలంగా ఉంటాయి...
మనసు చూసిన అనుభవాలే... మరీ మరీ విరబూస్తూ ఉంటాయి..
పూలలాగా ... కిరణాలలాగా...
పూలలాగా ... కిరణాలలాగా...

ఆగనంటుందీ ... అల్లరి వయసు..
ఊగిపోతుందీ... ఊయల మనసు...

చరణం 2:

నే వేసే ప్రతి అడుగు ... నీ వెంటే సాగుతుంది...
నీ తోడు లేని నాడు అది నాతోనే ఆగుటుంది...
నే వేసే ప్రతి అడుగు ... నీ వెంటే సాగుతుంది...
నీ తోడు లేని నాడు అది నాతోనే ఆగుటుంది...

కలతలెరుగనీ అనురాగాలే ... కలలు పండించుకుంటాయి...
కలతలెరుగనీ అనురాగాలే ... కలలు పండించుకుంటాయి...
శృతులు వీడని ఆ హృదయాలే... జతగా సాగుతూ ఉంటాయి...
నీరులాగా .... సెలయేరులాగా...
నీరులాగా .... సెలయేరులాగా...

ఆగనంటుందీ ... అల్లరి వయసు...
ఊగిపోతుందీ... ఊయల మనసు...

ఆ వయసుతో నన్నురకనీ...ఆ మనసులో నన్నూగనీ..
గాలిలాగా... కెరటాలలాగా...
గాలిలాగా... కెరటాలలాగా...

ఆగనంటుందీ ...అల్లరి వయసు...
ఊగిపోతుందీ..ఊయల మనసు...

No comments:

Post a Comment