Tuesday, July 1, 2014

భళి భళి భళి భళి దేవా

చిత్రం :  మాయాబజార్ (1957)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  మాధవపెద్ది సత్యం

పల్లవి:

భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా

చరణం 1:

ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో...
నీవారెవరో పై వారెవరో..
ఆ విధికైనను తెలియదయా .. బాగున్నదయా నీ మాయా

చరణం 2:

సుఖదుఃఖాలతో గుంజాటనబడు లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలు..
లీలలు మాయలు నీ గుణకథలు
 తెలిసినవారే ధన్యులయా .. బాగున్నదయా నీ మాయా

భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా

No comments:

Post a Comment