Tuesday, August 12, 2014

ఏమంటున్నది ఈ గాలీ?

చిత్రం :  మేమూ మనుషులమే (1973)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ..

ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ..


ఎగిరే పైటను ఏం చెయ్యాలి?

ఇంకో కొంగును ముడివెయ్యాలి... అహ..అహ..హ..

ఎగిరే పైటను ఏం చెయ్యాలి?

ఇంకో కొంగును ముడివెయ్యాలి...


ఏమంటున్నది ఈ గాలీ?

ఎగిరే పైటను అడగాలీ


చరణం 1 :


పైటకు తెలుసు ... చాటున పొంగే ప్రాయం రెపరెపలూ...

గాలికి తెలుసూ... విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ..

ఊగే నడుమూ.. సాగే జడతో ..వేసెను పంతాలూ..ఊ..

నీలో వుడుకూ .. నాలో దుడుకూ... చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..


ఏమంటున్నది ఈ గాలీ... ఎగిరే పైటను అడగాలీ...


చరణం 2 :


మబ్బు మబ్బుతో ఏకమైనది.. సాయం సమయంలో...ఓ..

మనసు మనసుతో లీనమైనది.. మమతల మైకంలో...ఓ..

అల్లరి కళ్లూ .. వెన్నెల నవ్వూ .. పెట్టెను గిలిగింతా..

వెచ్చని వొడిలో .. ఇచ్చిన చోటున .. ఇమిడెను జగమంతా..ఇమిడెను జగమంతా ..


ఏమంటున్నది ఈ గాలీ... ఎగిరే పైటను అడగాలీ...

అహ..హ..అహా...లల..ల.లా.లా..

 

అహ..హ..అహా...లల..ల.లా.లా..





No comments:

Post a Comment