Thursday, August 14, 2014

ఆడవే అందాల సురభామిని

చిత్రం :  యమగోల (1977)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వీటూరి

నేపథ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


ఆడవే అందాల సురభామినీ

ఆడవే అందాల సురభామినీ... పాడవే కళలన్నీ ఒకటేననీ..

ఆడవే అందాల సురభామినీ

గానమేదైనా స్వరములొక్కటే... 

పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని

నాట్యమేదైనా నడక ఒక్కటే... భాష ఏదైనా భావమొక్కటే ..

అన్ని కళల పరమార్థమొక్కటే... అందరినీ రంజింపజేయుటే..

ఆ... ఆ... ఆడవే అందాల సురభామినీ...


చరణం 1:


ఓహో రంభా... సకల కళానికురంబా

రాళ్ళనైనా మురిపించే జాణవట...  అందానికి రాణివట

ఏదీ... నీ హావభావ విన్యాసం?

ఏదీ... నీ నాట్యకళాచాతుర్యం?


ఆఆఆ... ఆఆఆ... ఆఆఆఆఆఆ


అరువది నాలుగు కళలందు మేటిని. .. అమరనాథునికి ప్రియ వధూటిని

అరువది నాలుగు కళలందు మేటిని. .. అమరనాథునికి ప్రియ వధూటిని

సరసాలలో... ఈ సురశాలలో .. ..

సరసాలలో...  ఈ సురశాలలో... సాటిలేని శృంగార వాటిని...

నిత్యవినూతన రాగ స్రవంతిని...  రసవంతిని జయ జయవంతిని...

రసవంతిని...  జయ జయవంతిని


చరణం 2 :

ఆడవే అందాల సురభామినీ... పాడవే కళలన్నీ ఒకటేననీ..

ఆడవే అందాల సురభామినీ


ఓహో ఊర్వశీ...  అపురూప సౌందర్య రాశి

ఏదీ...  నీ నయన మనోహర నవరస లాస్యం?

ఏదీ...  నీ త్రిభువన మోహన రూప విలాసం?


మదనుని పిలుపే నా నాదము ... స్మర సదన శాస్త్రమే నా వేదము

మదనుని పిలుపే నా నాదము ...  స్మర సదన శాస్త్రమే నా వేదము

కనువిందుగా...  తరుగని పొందుగా...  కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము

అంతులేని శృంగార పిపాసిని...  తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని..


చరణం 3 :

ఆడవే అందాల సురభామినీ... పాడవే కళలన్నీ ఒకటేననీ... 

ఆడవే అందాల సురభామినీ...

 

ఓహో మేనకా! మదన మయూఖా!!

సాగించు నీ రాసలీలా...  చూపించు శృంగార హేలా... 

సాగించు నీ రాసలీలా


నగవులతో మేని బిగువులతో...

నగవులతో మేని బిగువులతో...  వగలొలికించు వయ్యారి నెరజాణను

ఏ చోట తాకినా... ఏ గోట మీటినా... మధువులొలికించి మరులు చిలికించు

మధురమైన రసవీణను... రతిరాజ కళాప్రవీణను... సారంగలోచనను...


 ఆడవే అందాల సురభామినీ... పాడవే కళలన్నీ ఒకటేననీ .. 

ఆడవే అందాల సురభామినీ 

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=740 

No comments:

Post a Comment