చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1985) సంగీతం : రాజన్-నాగేంద్ర గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : జానకి
పల్లవి :
విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో.. శృతిని మించి రాగమేదో పలికే వేళలో... మౌనమైన గానమేదో నీవే తెలుసుకో...ఓ.. విరహ వీణ...నిదుర రాక వేగే వేళలో.. ఆ..ఆ..వేగే వేళలో...
చరణం 1 :
జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా.. సా..పదసరిగ...గా..దపదసరి...గాదపాగ.. గాపరీగ.. సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ... ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...ఆ ఆ ఆ ఆ ఆ
జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా.. ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా... లేలేత వలపు..సన్నాయి పిలుపు ..రావాలి సందిళ్ళ దాకా.. మన పెళ్ళిపందిళ్ళ దాకా..ఆ ఆ ....
విరహ వీణ ..హా....నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో...
చరణం 2 :
ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా.. చీకటిపగలు ..వెన్నెల సెగలు... నీ నీడ కోరేనురా.. ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా.. ఈ దూరమెన్నాళ్ళ దాకా...ఆ..ఆ..
విరహ వీణ ..హా...నిదుర రాక వేగే వేళలో.. శృతిని మించి రాగమేదో పలికే వేళలో... మౌనమైన గానమేదో నీవే తెలుసుకో... ఓ.. విరహ వీణ ...నిదుర రాక వేగే వేళలో..వేగే వేళలో
No comments:
Post a Comment