Wednesday, August 20, 2014

ఊరేది పేరేది ఓ చందమామా

చిత్రం :  రాజమకుటం ( 1961)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : పి. లీల,  ఘంటసాల


పల్లవి :


ఎందుండి వచ్చేవో.. ఏ దిక్కు పోయేవో.. ఓ..ఓ..ఓ..ఓ..


ఊరేది పేరేది ఓ చందమామా..ఆ..ఆ..
ఊరేది పేరేది ఓ చందమామా..ఆ..ఆ..
నిను చూచి నీలికలువ పులకించనేలా..ఆ..
ఊరేది పేరేది ఓ చందమామా..ఆ..ఆ..


ఓ..ఓ..ఓ..
జాబిల్లి నీలికలువ...విడరాని జంటా..ఆ..
ఊరేల పేరేలా.. ఓ కలువ బాలా..ఆ..ఆ..
ఊగేటి తూగేటి.. ఓ కలువ బాలా..ఆ..ఆ..  


చరణం 1:


ఆ..ఆ..ఆ...ఆ..
విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ..ఆ..
కురిసే తేనెల కలువనురా..ఆ..
తరిపి వెన్నెలల దొర రారా.. ఆ..
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..


మరుగేలనురా నెలరాజా.. తెర తీయర చుక్కల రేడా
రావోయి రావోయి.. ఓ చందమామా..ఆ..ఆ..


పరువములొలికే.. విరిబోణీ..ఈ..
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...ఆ..ఆ..
పరువములొలికే విరిబోణీ..ఈ.. స్వప్న సరసిలో సుమరాణీ..
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...ఆ..ఆ..


కొలనంతా వలపున తూగే.. అలలై పులకింతలు రేగే
నీ వాడనే గానా.. ఓ కలువ బాలా...ఆ...ఆ.. 


చరణం 2:


తరుణ మధుర మోహనా హిమకరా.. సరళ యవ్వనా మురాతి కనరా
సురుచిర మదనా నివాళి ఇదిగో..
సురుచిర మదనా నివాళి ఇదిగో.. వలచిన నా హృదయమే గైకొనరారా


నీ దాననే గానా.. ఓ కలువ రేడా..ఆ..ఆ..
నీ వాడనే గానా.. ఓ కలువ బాలా..ఆ..
ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్..



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=610

1 comment:

  1. ఈ పాట రచన దేవులపల్లి కాదు, బాలాంత్రపు రజనీకాంతరావు

    ReplyDelete