Thursday, August 14, 2014

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

చిత్రం :  యముడికి మొగుడు (1988)

సంగీతం :  రాజ్-కోటి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  జానకి


పల్లవి :


వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

సన్నతొడిమంటి నడుముందిలే .. లయలే చూసి లాలించుకో


ఓ.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా

ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా

చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా


చరణం 1 :


వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో .. వద్దు లేదు నా భాషలో

మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో .. హద్దు లేదు ఈ హాయిలో

కోడె ఊపిరి తాకితే..  ఈడు ఆవిరే ఆరదా

కోక గాలులే హోయ్ సోకితే.. కోరికన్నదే రేగదా?

వడగట్టేసి బిడియాలనే .. ఒడి చేరాను వాటేసుకో..

 వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా... నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా


చరణం 2 :


అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా... చీరకట్టు తానాగునా

పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా... జారుపైట తానాగునా

క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా

చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా

తొడగొట్టేసి జడివానకే .. గొడుగేసాను తలదాచుకో

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..



No comments:

Post a Comment