Thursday, August 21, 2014

కలనైనా.. క్షణమైనా

చిత్రం :  రాధా కళ్యాణం (1981)

సంగీతం :   కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి :

కలనైనా.. క్షణమైనా.. మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా..  మన ప్రేమా
కలనైనా.. క్షణమైనా 

చరణం 1:

నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు

నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు

నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ

నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా 

కలనైనా...  క్షణమైనా

చరణం 2 :

నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని

నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని

నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని

నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని

కౌగిలిలో.. కౌగిలిలా.. కరిగేదే.. మన ప్రేమా 

 కలనైనా క్షణమైనా మాయనిదే.. మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా మన ప్రేమా 

కలనైనా క్షణమైనా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5072 

No comments:

Post a Comment