Tuesday, August 19, 2014

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

చిత్రం : రాక్షసుడు (1991)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు,  జానకి


పల్లవి :

లలలల... లలలల... లలలల
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్చా

ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్ఛా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా


చరణం 1 :


రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా.. పగటి పూటంతా ఒకటే ఇచ్ఛా..

నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా... నీకు లేనందుకే నే మెచ్చా

కాచుకో ఘటోత్కచా కౌగిలే మజా.. అందుకే ఇలా వచ్చా చూడవే మజా


చీకటింట చిత్తగించా.. అందమంతా అప్పగించా

ముద్దు మురిపాలు ముందే ఇచ్చా... ముద్దబంతుల్లో నిన్నే ముంచా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా

మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా


చరణం 2 :


సోకులెన్నెన్నో నీలో నేనే చూచా.. మనసుతో పాటు మాటే ఇచ్చా

ఎన్ని రాత్రిళ్లు నీకై నేనే వేచా.. మనసులో నీకు చోటే ఇచ్చా

ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా.. చందమామనే తెచ్చా అందుకో రాజా


మోజులన్నీ మోసుకొచ్చా..  ఈడు జోడు రంగరించా

నీకు ప్రేమంటే తెలుసా బచ్చా.. నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా


అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్చా 

మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

 అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా

 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9381

2 comments:

  1. మాస్ట్రో ఇళయరాజా గారి అద్భుత స్వరకల్పన లో
    వేటూరి గారి రచనా పాటవానికి జానకమ్మ, బాలు గార్ల గాత్ర సౌందర్యం తోడైన గోల్డెన్ హిట్

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete