Saturday, August 16, 2014

కనరాని దేవుడే కనిపించినాడే

చిత్రం :  రంగులరాట్నం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో...
కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ 


చరణం 1:


అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...
మనసారా నిను చూడలేనైతి స్వామీ...
కరుణించి ఒకసారి కనిపించవేమీ... 


చరణం 2:


అందాల కన్నయ్య కనిపించగానే...
బృందావనమెల్ల పులకించిపొయే...
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ 


చరణం 3:


వలపుతో పెనవేయు పారిజాతమునై... ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... నీ చరణకమలాల నలిగి పోనీయవా...
ఆ..ఆ..ఆ..ఆ..


కనరాని దేవుడే కనిపించినాడే...
కనిపించి అంతలో కన్ను మరుగాయే ... కన్ను మరుగాయే..


No comments:

Post a Comment