Thursday, August 14, 2014

గుడివాడ ఎల్లాను

చిత్రం :  యమగోల (1977)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వీటూరి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


గుడివాడ ఎల్లాను... గుంటూరు పొయ్యాను

గుడివాడ ఎల్లాను... గుంటూరు పొయ్యాను

ఏలూరు.. నెల్లూరు.. ఎన్నెన్నో చూసాను

యాడ చూసినా.. ఎంత చేసినా.. ఏదో కావలంటారు

సచ్చినోళ్ళు... ఆటకు వచ్చినోళ్ళు

అబ్బబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు.. ఆటకు వచ్చినోళ్ళు


గుడివాడ ఎల్లాను... గుంటూరు పొయ్యాను


చరణం 1 :


 కమ్మని పాట.. చక్కని ఆట

కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు

కసి కసిగా హా కొందరు నన్ను

పాడమంటారు.. పచ్చిగ ఆడమంటారు

నచ్చానంటే.. జై కొడతారు

నచ్చకపోతే.. చీ కొడతారు

పిచ్చి పిచ్చి గా పైపడతారు

దుమ్ము కాస్తా దులిపేస్తారు

పోకిరోళ్ళు... యమ ఫోజు గాళ్ళు

ఓయబ్బో పోకిరోళ్ళు .. యమ ఫోజు గాళ్ళు


గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను

గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను

చిత్తూరు.. పుత్తూరు.. ఎన్నెన్నో చూసాను


చరణం 2 :


బందరులోనా అందరిలోనా

రంభవి అన్నాడు.. ఒకడు రావే అన్నాడూ

వైజాగు బాబు.. చేసాడు డాబు

రేటెంతన్నాడు.. ఆటకు రేటెంతన్నాడు

కాకినాడలో గల్లంతాయే..

తిరపతిలోనా పరపతిపోయే

అందరిమెప్పు పొందాలంటే.. దేవుడికైనా తరం కాదు

ఆ యముడికైనా తరం కాదు..

గట్టివాళ్ళు .. ఆటకు వచ్చినోళ్ళు

అబ్బబ్బబ్బబ్బ గట్టివాళ్ళు.. ఆటకు వచ్చినోళ్ళు


గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను

గుడివాడ ఎల్లాను.. గుంటూరు పొయ్యాను

ఒంగోలు.. వరంగల్లు.. ఎన్నెన్నో చూసాను


యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావలంటారు

సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

అబ్బబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6323 

No comments:

Post a Comment