Thursday, August 14, 2014

సమరానికి నేడే ప్రారంభం

చిత్రం : యమగోల (1977)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :   శ్రీశ్రీ

నేపధ్య గానం :  బాలు

పల్లవి :

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

 నరలోకమున కార్మిక శక్తికి.. తిరుగే లేదని చాటిద్దాం

ఇంక్విలాబ్‌.. జిందాబాద్‌.. కార్మిక సంఘం జిందాబాద్‌

లెఫ్ట్‌.. రైట్‌.. లెఫ్ట్‌.. రైట్‌

చరణం 1 :

 యముడి నిరంకుశ పాలన వద్దు.. యమ అర్జెన్సీ ఇకపై రద్దు

యముడి నిరంకుశ పాలన వద్దు.. యమ అర్జెన్సీ ఇకపై రద్దు

వెట్టిచాకిరికి తలపై మొట్టు... వెయ్యండర్రా అందరు ఒట్టు

ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు

భూలోకమె మన పుణ్యతీర్థమని.. భూలోకమె మన పుణ్యతీర్థమని

నరుడే గురుడని పూజిద్దాం...

 భూలోకం జిందాబాద్.. భూలోకం జిందాబాద్.. జయహో నరుడా

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

చరణం 2 :

కోరలు కొమ్మలు మీకిక వద్దు.. రంగుల తేడా లసలే వద్దు

కోరలు కొమ్మలు మాకిక వద్దు.. రంగుల తేడా లసలే వద్దు
జనతకు సమతను సాధించాలి.. చట్టం మార్చే ఓటుండాలి
ప్రజాస్వామ్యమును మన సౌధానికి.. పునాది రాళ్ళను పరిచేద్దాం..

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

 నరలోకమున కార్మిక శక్తికి.. తిరుగే లేదని చాటిద్దాం 

ఇంక్విలాబ్‌.. జిందాబాద్‌.. కార్మిక సంఘం జిందాబాద్‌

జయహో నరుడా.. జయహో నరుడా

No comments:

Post a Comment