Friday, August 22, 2014

నీ వలపే బృందావనం

చిత్రం :  రాధాకృష్ణ (1978)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

నేపథ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

నీ వలపే బృందావనం.... నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో...  తేలి ఆడాలిలే 

నీ వలపే బృందావనం... నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో... తేలి ఊగాలిలే

చరణం 1:

కొంటె కృష్ణుని కులుకు చూపులో...  కళ్యాణ కాంతులు మెరిశాయిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో...  కళ్యాణ కాంతులు మెరిశాయిలే

నా రాధ నడకలో ఈ వేళా... నవ వధువు తడబాటు కనిపించెలే 

రంగైన వజ్రాల పందిరిలో... రతనాల తలంబ్రాలు కురిసేనులే

రతనాల తలంబ్రాలు కురిసేనులే .. 

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

చరణం 2:

రాధా కృష్ణుల అనురాగాలు...  మనలో రాగాలు నిలపాలిలే

రాధా కృష్ణుల అనురాగాలు...  మనలో రాగాలు నిలపాలిలే

నీవు నేనూ జీవితమంతా  నవరాగ గీతాలు పాడాలిలే

మన హృదయాలు పూల నావలో మధుర తీరాలు చేరాలిలే

మధుర తీరాలు చేరాలిలే..

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

నీ వలపే బృందావనం.... నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో...  తేలి ఆడాలిలే 

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2513

2 comments:

  1. కల్యాణ కాంతులు మెరి*చా*యిలే
    రెండు సార్లు కూడా నీలి కెరటాలలో అనే వస్తుందండీ. నీలి గగనాలలో కాదు.
    నా రాధ నడకలో.. (నడత కాదు).
    తడబాటు కనిపించెలే (కలిగించెలే కాదు)

    ఈ దిద్దుబాట్లు చెయ్యగలరు.
    ధన్యవాదములు, అయ్యలసోమయాజుల మహేష్, వడోదర, గుజరాత్, ఇండియా

    ReplyDelete