Thursday, August 14, 2014

ఓలమ్మీ తిక్కరేగిందా

చిత్రం : యమగోల (1977)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


 ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

 ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

తిక్కరేగి తిమ్మిరెక్కి.. పైరగాలి పైటదీసి

పందిరేసి...  చిందులేసిందా


ఓరబ్బీ తిక్క రేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

 ఓరబ్బీ తిక్క రేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

తిక్కరేగి తిమ్మిరెక్కి... పిల్లగాలి చిచ్చురేపి

రెచ్చగొట్టిందా.. కొత్త పిచ్చి పట్టిందా

ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

చరణం 1 :


కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా

మూర తక్కువ చీర నీకు నిలువనంటుందా

బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా

ముట్టుకుంటే ముద్దులై.. నే పట్టుకుంటే జారిపోయే

 సిగ్గువలపు మొగ్గలేసిందా


ఓరబ్బీ తిక్క రేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా



చరణం 2 :


రంగు దేలి గిత్త పొగరు రంకె వేసిందా

గంగడోలు తాకితేనే కాలు దువ్విందా

కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా

పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద

బంతిపూల పక్కవేసిందా..


ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా



చరణం 3 :


పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు?

చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు?

వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు

ఆరుబయట అందమంతా ఆరబోసి కస్సుమంటూ

కన్నెమోజు కట్టుతప్పిందా

 ఓరబ్బీ తిక్క రేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

ఓరబ్బీ తిక్క రేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=741 

No comments:

Post a Comment