Thursday, September 4, 2014

మబ్బే మసకేసిందిలే

చిత్రం  :  వయసు పిలిచింది (1978)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు  



పల్లవి :



హే ముత్యమల్లే మెరిసేపోయే మల్లె మొగ్గా..ఆ..ఆ
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ..ఇంత సిగ్గా.. ఆ.. ఆ..


మబ్బే..మసకేసిందిలే..పొగమంచే తెరగా నిలిసిందిలే..
ఊరూ నిదరోయిందిలే.. మంచిసోటే మనకూ కుదిరిందిలే
మబ్బే.. మసికేసిందిలే..పొగమంచే తెరగానిలిసిందిలే..


చరణం 1 :


కురిసే సన్నని వాన.. సలి సలిగా వున్నది లోనా..
కురిసే సన్నని వాన.. సలి సలిగా వున్నది లోనా..
గుబులౌతుందే గుండెల్లోనా..
జరగనా కొంచం.. నేనడగనా లంచం..
చలికి తలలువంచం.. నీ ఒళ్ళే పూలమంచం..
వెచ్చగా వుందామూ..మనమూ..


హే పైటలాగా.. నన్ను నీవూ.. కప్పుకోవే.. ఏ..ఏ..ఏఏ.
గుండెలోనా..ఆ.. గువ్వలాగా వుండిపోవే.. ఏ..ఏ..ఏఏ
ఏ..ఏ.. ! మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే.. 


చరణం 2 :


పండే పచ్చని నేలా... అది బీడైపోతే మేలా...ఆ
పండే పచ్చని నేలా... అది బీడైపోతే మేలా...ఆ


మనసు కురిస్తే..వయసు తడిస్తే..
పులకరించు నేల..అది తొలకరించు వేళ..
తెలసుకో పిల్లా... నీ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ.. ఈ..ఈ.. మనదీ..ఈ..ఈ.ఈ


హే...కాపుకొస్తే కాయలన్నీ.. జారిపోవా..ఆ..ఆ..ఆ
జాముకొస్తే..కోర్కెలన్నీ.. తీరిపోవా..ఆ..ఆ..ఆ
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే.. 



చరణం 3 :


నవ్వని పువ్వే నువ్వూ.. నునువెచ్చని తేనేలు ఇవ్వూ
దాగదు మనసే.. ఆగదు వయసే..
యరగదే పొద్దు.. అది దాటుతుంది హద్దు...
ఇయ్యవా ముద్దు... ఇక ఆగదే వద్దు.
ఇద్దరమొక్కటవ్వనీ..ఈ..కానీ..


హే బుగ్గ మీద మొగ్గలన్నీ.. చూసుకోనీ...ఈ..ఈ
రాతిరంతా జాగారమే.. చేసుకోనీ..ఈ..ఈ
ఈ..ఈ..ఈ
మబ్బే.. మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిసిందిలే..
ఊరూ నిదరోయిందిలే.. మంచిసోటే మనకూ కుదిరిందిలే
మంచి... సోటే మనకూ కుదిరిందిలే


No comments:

Post a Comment