Wednesday, September 10, 2014

ఓ రంగయో.. పూలరంగయో

చిత్రం :  వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

ఓ.. అహహహా.. అహహహా.. అహహహా.. ఆ..
ఓ.. ఒహోహో.. ఒహోహో.. ఒహోహో.. ఓ..

ఓ రంగయో.. పూలరంగయో.. ఓరచూపు చాలించి సాగిపోవయో

పొద్దు వాలి పోతున్నదోయి.. ఇంత మొద్దు నడక నీకెందుకోయి

చరణం 1 :

పగలనక రేయనక పడుతున్న శ్రమనంత.. పరులకొరకు ధారపోయు మూగజీవులు

ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి.. ఆనందం పొందగలుగు ధన్యజీవులు

ఓ రంగయో.. పూలరంగయో.. ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలి పోతున్నదోయి.. ఇంత మొద్దు నడక నీకెందుకోయి
ఓ రంగయో.. పూలరంగయో.. ఓరచూపు చాలించి సాగిపోవయో 

చరణం 2 :

కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని.. ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో

కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి.. కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే

ఓ రంగయో.. పూలరంగయో.. ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలి పోతున్నదోయి.. ఇంత మొద్దు నడక నీకెందుకోయి
ఓ రంగయో.. పూలరంగయో.. ఓరచూపు చాలించి సాగిపోవయో

No comments:

Post a Comment