Thursday, September 4, 2014

జానకి కల్యాణం (హరి కథ)

చిత్రం : వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : కరుణశ్రీ , శ్రీ శ్రీ
నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి :



శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం సహృదయం


శ్రీరామ భక్తులారా!! ఇది సీతాకళ్యాణ సత్కథ.
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను.
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది...
నాయనా.. కాస్త పాలు మిరియాలు...
చిత్తం.... సిధ్ధం


చరణం 1 :


భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనించీ విచ్చేసిన వీరాధి వీరులలో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్యసుందరమూర్తి.. ఆహా! అతడెవరయ్యా అంటే..


రఘురాముడూ.. రమణీయ వినీల ఘనశ్యాముడూ...
రమణీయ.. వినీల.. ఘనశ్యాముడూ...
వాడు నెలరేడు.. సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీలనేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్గొనెడు మరోమరుడు.. మనోహరుడు రఘూరాముడూ


సనిదని సగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడూ...


సనిస సనిస సగరిరిగరి సరిసనిస పదనిస
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినినినిని పస పస పస పస
సప సప సప తద్దిం తరికిటతక
రఘురాముడూ.. రమణీయ వినీల ఘనశ్యాముడూ....


శభాష్! శభాష్!


ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి
సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో..


ఎంత సొగసూగాడే... ఎంత సొగసూగాడే... మనసింతలోనె దోచినాడే...
ఎంత సొగసూగాడే...
మోము కలువరేడే.. ఏ.. ఏ.... మోము కలువరేడే ...
నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే... ఎంత సొగసూగాడే




చరణం 2 :


ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా
అక్కడ స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను జూచి


అనియెనిట్లు ఓయనఘులార! నా యనుగుపుత్రి సీతా
వినయాధిక సద్గుణ వ్రాతముల విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువమీరగ వరించి మల్లెలమాలవైచి పెండ్లాడు ఊ ఊ....


అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట
మహావీరుడైన రావణాసురుడు కూడా
"హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుటయే మహాపాపము"
అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట


తదనంతరంబున
ఇనకులతిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత



చరణం 3 :


పెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమునందె నయము జయమును
భయము విస్మయముగదురా ఆ ఆ...


శ్రీమద్రమారమణ గోవిందో .... హరి
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది
మరొక్కసారి...
జై శ్రీమద్రమారమణ గోవిందో... హరి


భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు.. అంతట...


భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణి సంజాతన్ భాగ్యోపేతన్ సీతన్
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె...
శ్రీమద్రమారమణ గోవిందో.... హరి


5 comments:

  1. Much appreciate the hard work you put into this.
    I dont know much about you.. I just chnaced upon this from an Internet search.
    Suggest to transfer these into a wider platform like YouTube or Instagram. Please think about it seriously. You deserve much more recognition.

    ReplyDelete
  2. How can we express our gratitude to these great artists?
    Mahanubhavulaku paadaabhi vandanam!!!

    ReplyDelete