Tuesday, September 16, 2014

మత్తు వదల రా

చిత్రం :  శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


అపాయమ్ము దాటటానికి.. ఉపాయమ్ము కావాలి
అంధకారం అలిమినపుడు.. వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేని వాడు.. ఎందులకు కొరగాడు
సోమరియై కునుకువాడు..సూక్ష్మమ్ము గ్రహింపలేడు


మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే.. గమ్మత్తుగ.. చిత్తవ్వుదువురా
మత్తు వదల రా.. నిద్దుర మత్తు వదలరా 


చరణం 1 :


జీవితమున సగభాగం.. నిద్దురకే సరిపోవు
జీవితమున సగభాగం.. నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగం.. చిత్త శుద్ది లేక పోవు


అతి నిద్ర లోలుడు.. తెలివి లేని మూర్ఖుడు
అతి నిద్ర లోలుడు.. తెలివి లేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక..వ్యర్ధంగా చెడతాడు


మత్తు వదలరా..నిద్దుర మత్తు వదలరా 


చరణం 2 :


సాగినంత కాలం.. నా అంత వాడు లేడందురు
సాగక పోతే.. ఊరకె చతికిలబడి పోదురు
కండ బలము తోటే.. ఘన కార్యం సాధించలేరు
బుద్ది బలం తోడైతే.. విజయమ్ము వరింప గలరు


మత్తు వదలరా..నిద్దుర మత్తు వదలరా


చరణం 3 :


చుట్టు ముట్టు ఆపదలను మట్టు బెట్ట బూనుమురా
చుట్టు ముట్టు ఆపదలను మట్టు బెట్ట బూనుమురా
పిరికితనం కట్టి బెట్టి.. ధైర్యము చేపట్టుము రా


కర్తవ్యం నీ వంతు.. కాపాడుట నా వంతు
కర్తవ్యం నీ వంతు.. కాపాడుట నా వంతు
చెప్పటమే నా ధర్మం..వినక పోతే నీ ఖర్మం


మత్తు వదల రా.. నిద్దుర మత్తు వదల రా
ఆ మత్తులోన పడితే.. గమ్మత్తుగ.. చిత్తవ్వుదువురా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=88

No comments:

Post a Comment